- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కల్తీకల్లు ఎఫెక్ట్: పిచ్చిగా ప్రవర్తిస్తున్న జనం.. 10 మంది ఆసుపత్రి పాలు..
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: కల్తీకల్లుకు అలవాటు పడిన పలువురు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణంలోని మోతీ నగర్, బొక్కల్లోనిపల్లి తదితర ఏరియాలకు చెందిన పలువురు స్థానికంగా ఉన్న దుకాణాలలో కల్లు తాగుతుంటారు. అయితే చెట్ల నుంచి ఆశించిన స్థాయిలో కల్లు రాకపోవడంతో వ్యాపారులు డైజో ఫాం, క్లోరోఫాం తదితర మత్తు పదార్థాలు కలుపుతూ కల్లు తయారు చేసి కస్టమర్లకు విక్రయిస్తున్నారు. కల్తీకల్లుకు బానిసైన కొంతమంది ప్రతిరోజు సరిగా నిద్రపోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఆ విషయం వ్యాపారులకు తెలియడంతో మత్తు పదార్థాలను కలపడం బాగా తగ్గిండంతో కల్లుకు అలవాటు పడిన కొంతమంది అస్వస్థతకు గురయ్యారు.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పదిమంది అస్వస్థతకు గురై పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి వరకు ఆరు మంది కోలుకొని ఇంటికి వెళ్లగా మరో నలుగురు జిల్లా ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నారు. శనివారం ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ పదిమంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని, ఆరుగురు కోలుకొని వెళ్లిపోయారని చెప్పారు. మరో నలుగురు వైద్య చికిత్సలు పొందుతున్నట్లుగా వెల్లడించారు. కాగా రూరల్ పోలీసులు కల్తీ కల్లు వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.