అలా చేస్తే కాళేశ్వరం పూర్తిగా కూలిపోతుంది: ఉప ముఖ్యమంత్రి బట్టి

by Mahesh |   ( Updated:2024-02-17 11:13:58.0  )
అలా చేస్తే కాళేశ్వరం పూర్తిగా కూలిపోతుంది: ఉప ముఖ్యమంత్రి బట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మేడిగడ్డ మాదిరిగా సుందిళ్ల, అన్నారం పరిస్థితి ఉండబోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందని. పగుళ్లకు రిపేర్లు చేస్తే ఉన్న ప్రాజెక్టు కూలిపోతుంది. ప్రజెక్టులు ఏమైనా సరే మనకు డబ్బులు వస్తే చాలనే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని. ప్రాజెక్టుల రీడిజైన్ తో శాశ్వతంగా శబరి నదిని కోల్పోయామని భట్టి అసెంబ్లీలో చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed