మరోసారి డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్టు..!

by Mahesh |   ( Updated:2024-09-02 15:25:54.0  )
మరోసారి డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్టు..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారిపోయాయి. ఈ క్రమంలో కొన్ని పాత జలాశయాలకు ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా.. నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్టు మరోసారి ప్రమాదం అంచుల్లో కి వెళ్లింది. ఎగువన కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి.. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అప్రమత్తంగా ఉన్న అధికారులు 8 గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. ఔట్ ఫ్లో 2, 65,218 క్యూసెక్కులు ఉంది. ఇన్ ఫ్లో 3.50 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 695 అడుగులకు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed