‘కబాలి’ ప్రొడ్యూసర్ డ్రగ్స్ కేసు : కేపీ చౌదరి రిమాండ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-23 07:10:54.0  )
‘కబాలి’ ప్రొడ్యూసర్ డ్రగ్స్ కేసు : కేపీ చౌదరి రిమాండ్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కస్టడీ ముగియటంతో కొకైన్ కేసులో అరెస్ట్ అయిన సినీ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అంతకుముందు అతనికి వైద్య పరీక్షలు జరిపించారు. ‘కబాలీ’ సినిమా తెలుగు వర్షన్‌కు నిర్మాత అయిన చౌదరి ఇటీవల కొకైన్ అమ్ముతూ కిస్మత్ పూర్ చౌరస్తాలో పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాగా, చౌదరి నుంచి డ్రగ్స్ కొన్నవారిలో టాలీవుడ్‌కు చెందిన కొందరు సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారుల కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెళ్లడయ్యింది. ఈ క్రమంలో పోలీసులు కోర్టు అనుమతితో అతన్ని కస్టడీకి తీసుకొని విచారించారు. కస్టడీ గడువు ముగియటంతో శుక్రవారం జైలుకు రిమాండ్ చేసారు. కాగా, విచారణలో చౌదరి టాలీవుడ్‌కు చెందిన వారితో పాటు మరికొందరి పేర్లు వెల్లడించినట్టు తెలిసింది. వీరికి నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.

Read More... పెళ్లి కాకుండానే రెండో సారి తల్లి కాబోతున్న స్టార్ హీరోKP Chowdaryయిన్.. నెట్టింట ఫోటోలు వైరల్

Advertisement

Next Story