- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో MLC కవిత అరెస్ట్ ఖాయం: KA పాల్ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అరెస్టు అవుతారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ కుమార్ పిళ్లైని సోమవారం రాత్రి ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం కేఏపాల్ స్పందిస్తూ.. ఈ పిళ్లై ఎమ్మెల్సీ కవిత బినామీ అని ఆరోపించారు. దాదాపు లిక్కర్ స్కాంలో తాను చెప్పిన పేర్లను అరెస్టు చేశారని, కవితను కూడా అరెస్ట్ చేస్తారని తెలిపారు.
లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 6 శాతం పర్సంటేజ్ ఉందని ఆరోపించారు. ఈ లిక్కర్ స్కాం వారికి చిన్నదని అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల కోట్లు అప్పు ఎందుకైందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు తీసుకోని, రూ. 50 వేల కోట్లు మాత్రమే లెక్కలు తేలాయని, దీంతో రూ. 80 వేల కోట్లు వడ్డినే కట్టాల్సి ఉందని వెల్లడించారు. ఇప్పుడేమో మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 750 కోట్లు రుణాలు ఇస్తామని అంటున్నారని పేర్కొన్నారు.
ఎంతో మంది మహిళలు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటుంన్నారని, దాడులు జరుగుతున్నాయని, కేసీఆర్‌కు నీతి నిజాయితీ లేదని మండిపడ్డారు. సీఎం ఎంతో అవినీతి చేశారని, సత్యాన్ని ఒప్పుకుని, ఇప్పటికైనా మారాలని, దోచుకున్న డబ్బును తెలంగాణ ప్రజలకు పంచాలని సూచించారు. తెలంగాణలో పిళ్లై లాంటి బినామీలు ఎంతో మంది ఉన్నారని చెప్పారు. వీరి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.