- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపో మాపో MLC కవిత అరెస్ట్: కేఏ పాల్
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీ సీబీఐ ఆఫీసు వద్ద హంగామా సృష్టించారు. ఆరు నెలలుగా లిక్కర్ స్కాం దర్యాప్తు జరుగుతుందన్న ఆయన సీబీఐ కేసు విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. సిసోడియా, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలని అధికారులను కోరేందుకు కేఏ పాల్ ఇవాళ సీబీఐ కార్యాలయానికి వెళ్లారు.
అయితే ఆదివారం కావడంతో అధికారులు లేరని తిరిగి రేపు రావాలని పాల్‌కు అక్కడి సిబ్బంది చెప్పారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు వేగంగా జరపాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. లిక్కర్ స్కాం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని, ఆలస్యం చేస్తే రాజకీయాలకు అంటగడతారని ఆరోపించారు. రేపో మాపో కవితను, సిసోడియాను అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యానించారు. సిసోడియాకు సీబీఐ నోటీసులు ఇస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు కానీ కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పాల్ ప్రశ్నించారు.