మోడీ గెలిచిందే.. CRPF జవాన్ల పేరు చెప్పుకుని: ప్రధానిపై కేఏ పాల్

by Satheesh |   ( Updated:2023-02-18 15:09:31.0  )
మోడీ గెలిచిందే.. CRPF జవాన్ల పేరు చెప్పుకుని: ప్రధానిపై కేఏ పాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ల పేరు చెప్పుకోనే నరేంద్ర మోడీ ప్రధానిగా అయ్యారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కేఏ పాల్ ఎక్స్ పారామిలటరీ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేఏ పాల్‌కు రిటైర్డ్ పారమిలటరీ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ.. 75 ఏళ్లుగా దేశానికి సేవ చేసిన ఎక్స్ పారామిలటరీ కుటుంబాలు అనేక సమస్యలతో బాధపడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బార్డర్‌లో వారు దేశ రక్షణ కోరకు ప్రాణాలు పనంగా పెట్టారని, పార్లమెంటును కాపాడారని వివరించారు.

సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ లాంటి పారమీలటరీ కుటుంబాలు దేశవ్యాప్తంగా 5 శాతం ఓటర్లుగా ఉన్నారని వెల్లడించారు. ఎక్స్ పారమీలటరీకి పెన్షన్‌లు, ఎక్స్ గ్రేషియా పెంపు, హెల్త్ బెనిఫిట్స్, పలు సమస్యలపై వారు ఉద్యమం చేస్తున్నారని, అయిన కేంద్ర ప్రభుత్వం, మోడీ, అమిత్‌షా స్పందించడంలేదని అన్నారు. అదానీ, అంబానీ లాంటి వారికి బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు వీరి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. నెల రోజుల్లో వారి సమస్యలు పరిష్కరించాలని లేదంటే తర్వాత యాక్షన్ ప్లాన్ ఉంటుందని కేంద్రాన్ని హెచ్చరించారు.

Also Read...

''ఫిబ్రవరి 18''.. CM కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రోజు: MLC కవిత

Advertisement

Next Story