హైడ్రా కమిషనర్‌తో జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా టీం భేటీ

by Gantepaka Srikanth |
హైడ్రా కమిషనర్‌తో జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా టీం భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో వరదలు తగ్గించడంపై జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా(Justice Moment of India team) ప్రతినిధులు ఇటీవల డాక్యుమెంటరీతో పాటు శ్వేతపత్రం విడుదల చేశారు. కాగా బుధవారం ఆ బృందం హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath)ను కలిశారు. నగరంలో వరదల నియంత్రణపై పలు అంశాలతో కూడిన సూచన పత్రాలను రంగనాథ్‌కు అందజేసినట్లు జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఆకర్ష్ శ్రీరామోజు, గౌతమ్ రాగి తెలిపారు. రంగనాథ్‌కు 15 అంశాలతో పలు సూచనలు చేసినట్లు వివరించారు. వరదలు నిత్యం పునరావృతమవుతూనే ఉంటాయని, వాటి నివారణకు ప్రభుత్వం తీసుకునే చర్యల అవసరాన్ని అందులో పేర్కొన్నట్లు తెలిపారు. నగరంలో వరదల నియంత్రణకు హైడ్రా కమిషనర్ చురుకైన పాత్ర పోషించాలని వారు కోరారు.

వరదల నియంత్రణకు అవలంభించాల్సిన విధివిధానాలను ఆచరణలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తాము రిలీజ్ చేసిన శ్వేతపత్రం ద్వారా సమగ్రమైన ఫ్రేమ్ వర్క్‌తో ఆచరణలోకి తీసుకొస్తే నగరంలో వరదల నివారణను గణనీయంగా తగ్గించవచ్చని జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఆకర్ష్ శ్రీరామోజు, గౌతమ్ రాగి తెలిపారు. ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించాలని, వరదలు లేని హైదరాబాద్ కోసం చేయి చేయి కలపాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story