ఆస్కార్ వచ్చిందన్న విషయం ముందు తనకే చెప్పా: NTR

by GSrikanth |   ( Updated:2023-03-15 02:50:40.0  )
ఆస్కార్ వచ్చిందన్న విషయం ముందు తనకే చెప్పా: NTR
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినీ అభిమానుల ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చి ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం చరిత్ర తిరగరాసింది. ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. తాజాగా.. ఆస్కార్ అవార్డుపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన ఎన్టీఆర్‌కు శంషాబాద్‌లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిందని ప్రకటన రాగానే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయంది. విషయాన్ని వెంటనే నా భార్య ప్రణతికి ఫోన్ చేసి చెప్పా’ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Read more:

Oscar 2023 : ఆర్ఆర్ఆర్ కంటే బాహుబలి2 రేంజే ఎక్కువ?మరి ఆస్కార్‌ ఎందుకు రాలేదు?

అల్లు అర్జున్ ట్వీట్‌తో బయటపడిన మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు

Advertisement

Next Story