చంద్రబాబు స్కిల్ కేసులో గేమ్ ఆడుతున్న న్యాయ వ్యవస్థ : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
చంద్రబాబు స్కిల్ కేసులో గేమ్ ఆడుతున్న న్యాయ వ్యవస్థ : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : చంద్రబాబు స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో 17A గురించి సుప్రీం కోర్టు భిన్నాభిప్రాయాలుపై నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ కేసులో చంద్రబాబుకు 17A వర్తింస్తుందా, వర్తించదా అనే అంశంపై ఇవాళే తీర్పు రావాల్సి ఉన్నా.. ద్విసభ్య ధర్మాసనం భిన్నభిప్రాయాలు వెలువరించిందని తెలిపారు. బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్లపై కేసులు ఉండవని, వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలు, నాయకులు మీద ఎప్పుడు కత్తులు వేలాడుతూనే ఉంటాయని ఆరోపించారు. అదే తరహాలోనే స్కిల్ కేసులో కూడా న్యాయ వ్యవస్థ చంద్రబాబుకు 17A వర్తిస్తుందా.. వర్తించదా అన్న విషయంలో ఓ రకమైన గేమ్ ఆడుతోందని అన్నారు. ఇది ఒక రకమైన రాజకీయ బెదిరింనేనని, ఇది వ్యక్తుల మీద ఒత్తిడి తప్ప మరొకటి కాదని అన్నారు. ఇందులో రాజకీయ జోక్యం చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు.

Advertisement

Next Story