High Court : ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

by Y. Venkata Narasimha Reddy |
High Court : ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(Brs) నుండి కాంగ్రెస్(Congress) లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల(MLAs)అనర్హత పిటిషన్(Disqualification)పై హైకోర్టు(High Court)లో వాదనలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ Reserve judgmentచేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై షెడ్యూల్‌ ఖరారు చేయాలని గతంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. అయితే సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ. నరసింహాచార్యులు సవాల్‌ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు , ఫిరాయింపు ఎమ్మెల్యేల తరుపున న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు.

ఇదే కేసులో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లలో సింగిల్‌ జడ్జి సరైన ఉత్తర్వులే జారీ చేశారని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి తరపు సీనియర్‌ న్యాయవాది జే.ప్రభాకర్‌రావు తన వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో, సభ ఓటింగ్‌లో గానీ పాల్గొనకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు ఇంతకుముందే తోసిపుచ్చింది. అనర్హత పిటిషన్లపై తేల్చకుండా ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, శ్రీహరి ల పైన అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

Advertisement

Next Story