ఈ నెల 16న తెలంగాణకు JP Nadda

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-05 07:22:49.0  )
ఈ నెల 16న తెలంగాణకు JP Nadda
X

దిశ, వెబ్ డెస్క్: ఈనెల 16న తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణపై ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసిన నేపథ్యంలో జేపీ నడ్డా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తు కార్యచరణపై పర్యటన సందర్భంగా రాష్ట్ర నేతలకు జేపీ నడ్డా దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు జేపీ నడ్డా కార్యాలయం తెలంగాణ నేతలకు సమాచారం అందించింది. నడ్డా షెడ్యూల్ దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉండాలని రాష్ట్ర నేతలకు సూచించారు. కాగా సోమవారం ఢిల్లీలో రెండు రోజుల పాటు భాజపా కీలక సమావేశాలను నిర్వహించనుంది. దేశం నలుమూలల నుంచి పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్న ఈ సమావేశాల్లో 2024 లోక్ సభ ఎన్నికలకు పార్టీ సన్నధతపై సమీక్షించనున్నారు.


Read More.......

వేములవాడ రాజకీయాల్లో 'CESS' కలకలం

Advertisement

Next Story