- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజల నుంచి సూపర్ రెస్పాన్స్.. లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో జోష్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా పాలన ప్రోగ్రామ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన మద్దతు పెంచుకోవాలని భావిస్తున్నది. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్‌ను పొంది విజయవంతంగా ముందుకు సాగాలని ఆలోచిస్తున్నది. ప్రజాపాలన, అభయహస్తం, గ్రామ సభల ద్వారా పబ్లిక్‌కు దగ్గరై, సమస్యలు తెలుసుకోనున్నది. ప్రజల నుంచి ఆదరణ పొంది, అదే జోష్‌తో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినట్లే, పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు పొంది తన పార్టీ నుంచి ఎక్కువ మంది ఎంపీలను పార్లమెంట్‌కు పంపాలని కాంగ్రెస్ రెడీ అయింది. దీనికి ప్రజాపాలన ప్రోగ్రామ్‌ను అనుసంధానించి ప్రజల్లో కాంగ్రెస్ వేవ్‌ను కొనసాగించనున్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైమ్ గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈ గ్రీవెన్స్‌లో ఆరు గ్యారంటీలతో పాటు ఇతర సమస్యలను కూడా స్వీకరిస్తామని స్వయంగా సీఎం చెప్పారు. అయితే పదేళ్ల నుంచి పెండింగ్ సమస్యలన్నింటినీ ఈ స్పెషల్ డ్రైవ్ గ్రీవెన్స్‌లో అడ్రస్ చేయనున్నారు. ఆఫీసర్లు, నేతలే గ్రామ సభల ద్వారా ప్రజల ముందుకు వెళ్లనున్నారు. దీంతో ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే భావనలో సర్కార్ ఉన్నది.
సమస్యలు సెలక్ట్..?
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ రకాల సమస్యలతో పబ్లిక్ సతమతమయ్యారనేది కాంగ్రెస్ ఆరోపణ. ధరణితో చిక్కులు, రేషన్ కార్డుల పంపిణీ లేకపోవడం, పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వకపోవడం, అర్హులకు ఫించన్లు అందలేదని కాంగ్రెస్ పదే పదే ప్రచారం చేసింది. ఇప్పుడు ప్రభుత్వంలోకి రావడంతో ఈ సమస్యలన్నీ గుర్తించాలని నిర్ణయం తీసుకున్నది. దీనిలో బాగంగానే గ్రామ సభలను ఏర్పాటు చేసి అప్లికేషన్లను తీసుకోనున్నారు. మెజార్టీ సమస్యలను గుర్తించి అందుకు అనుగుణంగా సర్కార్ సొల్యూషన్‌ను రూపకల్పన చేయనున్నది. రేషన్ కార్డులు ఎంత మందికి ఇవ్వాలి? ఇళ్లు ఎందరికీ ఇవ్వాలి? పించన్లకు అర్హులెంతమంది?ఇలాంటి తదితర వివరాలను ప్రభుత్వం గుర్తించి, విడతల వారీగా శాశ్వత పరిష్కారానికి కృషి చేయనున్నది.
పదేళ్ల తర్వాత అధికారికంగా..
పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గ్రామ సభలకు ప్రోగ్రామ్ కోసం కీలక నేతలందరికీ అధికారులు ఇన్విటేషన్లు, సమాచారం అందజేశారు. ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటుచేసి మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా తదితర పథకాలు(ఆరు గ్యారెంటీ)ల కోసం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు రెండు దఫాలుగా తీసుకోనున్న అప్లికేషన్ల ప్రక్రియకు కాంగ్రెస్ కీలక నేతలంతా హాజరుకానున్నారు. ప్రభుత్వ అధికారులతో కలిసి ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం కానున్నారు. అయితే ఫస్ట్ టైమ్ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందడంతో చాలా మంది నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.