Jishnudev Varma: రేపు గవర్నర్‌గా ప్రమాణం చేయనున్న జిష్ణుదేవ్ వర్మ

by Shiva |
Jishnudev Varma: రేపు గవర్నర్‌గా ప్రమాణం చేయనున్న జిష్ణుదేవ్ వర్మ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు నూతన గవర్నర్‌గా ఎన్నికైన జిష్ణుదేవ్ వర్మ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం జిష్ణదేవ్ వర్మ రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రిపుర రాష్ట్రం నుంచి గవర్నర్‌గా ఎన్నికైన తొలి వ్యక్తి తనే అని పేర్కొన్నారు. అయితే, గవర్నర్‌గా ఎన్నికైన వెంటనే తనకు సీఎం రేవంత్‌రెడ్డి కాల్ చేసి స్వాగతించారని జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. మోదీ ఆదేశాల మేరకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా సక్రమంగా చేపడుతానని తెలిపారు.

Advertisement

Next Story