కేసీఆర్ కు ఝలక్.. ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో బిగ్ స్కెచ్

by Prasad Jukanti |
కేసీఆర్ కు ఝలక్.. ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో బిగ్ స్కెచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో:పార్లమెంట్ ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి సారించింది. ఈ నెల 27న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సభ ద్వారా లోక్ సభ శంఖారావాన్ని పూరించాలని భావిస్తున్న హస్తం నేతలు ఆలోపే జాయినింగ్స్ పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలే టార్గెట్ గా స్కెచ్ వేస్తున్నారు. ఇప్పిటికే వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేప్పి హస్తం పార్టీలో చేరిపోగా తాజాగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, శోభన్ రెడ్డిలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ రిజైన్ లెటర్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడిపోగా ఎంపీ ఎన్నికల వేళ తాజా పరిణామం బీఆర్ఎస్ కు బిగ్ షాక్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది.

రేపే హస్తం గూటికి:

ఇటీవల పార్టీ అనుసరిస్తున్న విధానాలు తీవ్రంగా బాధిస్తున్నాయని శ్రీలత, శోభన్ రెడ్డిలు తమ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 24 ఏళ్లుగా పార్టీ కోసం సైనికుడిగా పని చేశామని బీఆర్ఎస్ వ్యవపస్థాపక సభ్యుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ పనులు చేశానని శోభన్ రెడ్డి గుర్తు చేశారు. కానీ పార్టీలో ఉద్యమకారులకు మనుగడ కరువైందని కష్టనష్టాల సమయంలో మీతో ఉన్న మాలాంటి ఉద్యమకారులకు పార్టలో ప్రాధాన్యత లేకపోవడం మమ్మల్ని తీవ్రంగా బాధించిందని అందుకే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా వీరు రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షలంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి భేటీ:

మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డిలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి శనివారం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న తీగల కృష్ణారెడ్డి తన కోడలుతో సహా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన తన కోడలితో కలిసి ముఖ్యమంత్రినివాసంలో ప్రత్యక్షం కావడంతో ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఏ నేత ఎప్పుడు ఝలక్ ఇస్తారో తెలియక బీఆర్ఎస్ క్యాడర్ కన్ఫ్యూజన్ కు గురవుతున్నట్లు చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ బలంపై కాంగ్రెస్ వ్యూహం:

సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బలంగా ఉన్న జీహెచ్ఎంసీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా విజయాలు దక్కినా హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ పూర్తి ఆధిక్యతను కనపరిచింది. దీంతో కాంగ్రెస్ నాయకత్వంం ప్రస్తుతం పూర్తి స్తాయిలో హైదరాబాద్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పిటేక హైదారాబాద్ మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ బొంతురామ్మోహన్, బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోగా ప్రస్తుత మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రితో గతంలో వేర్వేరుగా భేటీ అయ్యారు. దీంతో వీరంతా పార్టీ మారుతారేన ప్రచారం జరింది. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ డిప్యూటీ మేయర్ శ్రీలత సోభన్ రెడ్డి దంపతులు తాజాగా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. దీంతో ముఖ్యంత్రితో భేటీ అయిన మిగతా లీడర్లు సైతం త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈనెల 27 చేవెళ్లలో నిర్వహించబోయే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు. ఆలోపే పెద్ద ఎత్తున చేరికలు జరిగేలా హస్తం నేతలు స్కెచ్ వేస్తున్నారని తెలుస్తోంది. మరికొందరు నేతలు ఆ సభలో కండువా కప్పుకునే ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆపరేషన్ ఆకర్షి కేసీఆర్ కు ఎదురు దెబ్బగా మారుతున్నదనే చర్చ జరుగుతోంది.కేసీఆర్ కు ఝలక్.. ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో బిగ్ స్కెచ్

Advertisement

Next Story