- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jeevan Reddy vs Smita Sabharwal: మండలిలో స్మితా సబర్వాల్ వివాదం
దిశ, డైనమిక్ బ్యూరో: అఖిల భారత సర్వీసు ఉద్యోగాలలో దివ్యాంగుల రిజర్వేషన్ కోటాపై సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యల దుమారం శాసన మండలికి చేరింది. గురువారం శాసనమండలిలో మాట్లాడిన జీవన్ రెడ్డి.. ఆమె వ్యాఖ్యలపై మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ దివ్యాంగులను కించపరిచేలా, వారి ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా పదే పదే వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. దివ్యాంగులను అవమానించేలా మాట్లాడిన స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. స్మితా మొత్తం రిజర్వేషన్ సిస్టమ్ నే అవమానించారని, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విధానాన్ని ఆమె ప్రశ్నించారన్నారు. దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడితే చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదో నాకు అర్థం కావడం లేదన్నారు. స్మితా సబర్వాల్ పై చర్యలు తీసకోవాలని మండలి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తిని పంపాలని కోరారు.