HYD: కిక్కిరిసిపోయిన JBS, MGBS బస్ స్టేషన్లు

by GSrikanth |
HYD: కిక్కిరిసిపోయిన JBS, MGBS బస్ స్టేషన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఆదివారం సెలవు దినం కావడంతో నగర వాసులంతా గ్రామాలకు ప్రయాణమయ్యారు. కాగా, రద్దీని ముందే గ్రహించిన టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. బతుకమ్మ, దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు సైతం పూర్తి చేసింది. ముఖ్యంగా సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించింది. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23 దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అవసరాన్ని బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed