- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర అధికార గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ ఇంతకు ముందు లేదా?
దిశ, డైనమిక్ బ్యూరో: ‘జయ జయహే తెలంగాణ’ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపికయింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌లో జరిగిన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర అధికార గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ అనే పాటను కేబినెట్ ఆమోదం. అయితే తెలంగాణలోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు ఈ పాటను పాడుతున్నారు.
అయితే ఈ గీతాన్ని గత ప్రభుత్వం అధికారికంగా గుర్తించలేదని, 2021లో మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం గీతం రాసుకున్నప్పుడు దాని గురించి ప్రకటన చేస్తామని కేసీఆర్ అప్పట్లో చెప్పారు. ఈ క్రమంలోనే ఈ పాటకు రాష్ట్ర గీతం హోదాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది.