చిట్యాలలో జవాన్ విగ్రహం ఆవిష్కరణ..

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-28 04:43:45.0  )
చిట్యాలలో జవాన్ విగ్రహం ఆవిష్కరణ..
X

దిశ, తాడ్వాయి : ఆ జవాను దేశసేవలో భాగంగా అస్సాంలో విధులు నిర్వహిస్తుండగా దురదృష్టవశాత్తు బాంబు పేలి ప్రాణాలు కోల్పోయడు. అయితే అతని ఊరు మాత్రం అతన్ని గుండెల్లో పెట్టుకుంది. దేశం కోసం అమరుడైన సైనికుడు కంది సిద్ధి రాములు సేవలను స్మరిస్తూ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని చిట్యాల గ్రామంలో సోమవారం వారి కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆకలిని తీర్చే బాధ్యతను రైతు తన భుజాల మీద వేసుకుంటే, దేశ పౌరులంతా నిశ్చింతగా ఉండేందుకు సైనికుడు తన ప్రాణాలను పణంగా పెడతాడతన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని అణచడానికి, ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను ఆదుకునేందుకు సైనికులు ముందుంటారన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు సిద్ధిరాములు విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవిత, బాలయ్య, ఎంపీటీసీ రాజమణి, రవీందర్, ఏఎస్పీ అన్యోన్య, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రమన్, ఎస్సై ఆంజనేయులు, అంబీర్ మనోహర్, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story