- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో జనసేన పోటీ.. TRS ఓట్లు చీలే అవకాశం!
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మరోపార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్నిపార్టీలతో ప్రధానపార్టీలు సతమతమవుతుండగా, తాజాగా జనసేన పార్టీ పోటీ చేస్తామని ప్రకటించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు భారీగా యూత్ ఫాలోయింగ్ ఉండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీలే అవకాశం ఉంది. ఏయే నియోజకవర్గాల్లో పోటీపై కసరత్తును ప్రారంభించింది.
రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, సీపీఎం, సీపీఐ, తెలంగాణ జన సమితి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, బహుజన్ సమాజ్ పార్టీ, లోక్ సత్తా పార్టీ, బీఎస్పీ, వైఎస్ఆర్టీపీలు ఉన్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ, వైఎస్ఆర్టీపీ తప్పా మిగతా అన్ని పార్టీలో బరిలో ఉంటున్నాయి. దీంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల ఓటు బ్యాంకుకు గండికొడుతున్నాయి.
ఇదిఇలా ఉంటే రాబోయే ఎన్నికలకు బీఎస్పీ, వైఎస్సార్టీపీ పోటీకి సన్నద్ధమవుతున్నాయి. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే మునుగోడు బైపోల్ లో సైతం అభ్యర్థిని నిలబెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. దళితులు దళితబంధుతో టీఆర్ఎస్‌కు దగ్గరకావడంతో వారి ఓట్లే టార్గెట్‌గా ఆర్ఎస్పీ ఫోకస్ పెట్టారు. దళితవాడల్లో పర్యటించి వారిని చైతన్యపరుస్తున్నారు. స్వేరో సభ్యులను సైతం వినియోగించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సైతం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరుతో పాటు పలునియోజకవర్గాల్లో పోటీ చేయాలని పాదయాత్రను సైతం నిర్వహిస్తు ప్రజలకు చేరువ అవుతున్నారు. రెడ్డిసామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం.
మరోపక్క జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాన్ సైతం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తున్నట్లు విజయవాడ వేదికగా ప్రకటించారు. కొండగట్టు నుంచి తెలంగాణలో రాజకీయం మొదలు పెడతామని పేర్కొన్నారు. 7 నుంచి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అయితే పవన్‌కు ఫాలోవర్స్ అంతా యువతకులే. టీఆర్ఎస్‌లో ఎక్కువమంది యువతే కావడంతో రాబోయే ఎన్నికల్లో యువత ఓట్లు జనసేనకు పడే అవకాశం ఉంది. ఓట్లు చీలితే టీఆర్ఎస్ గెలుపుపై ప్రభావం చూపనుందని ఆపార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జనసేన గెలుపు సంగతి అంటుంచితే ప్రధానపార్టీలకు మాత్రం భయం మాత్రం పట్టుకుంది. తెలంగాణలో జనసేన ఒంటిరిగా పోటీ చేస్తుందా? లేకుంటే టీడీపీ, బీజేపీతో కలిసి పనిచేస్తుందా? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఏదీ ఏమైనా జనసేన మాత్రం పలుపార్టీల గెలుపోటములపై మాత్రం ప్రభావం చూపనుంది.