- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Varahi Registration : 'వారాహి' వాహనానికి లైన్ క్లియర్
దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 'వారాహి' వాహనానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడిందని వార్తలు వచ్చి కొన్ని గంటలు గడవకముందే వారాహి రిజిస్ట్రేషన్ ఎప్పుడో పూర్తయిందని తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది. 'వారాహికి లైన్ క్లియర్ అయింది. ఈ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయి. వారం కిందటే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది' అని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని ఆయన స్పష్టం చేశారు. వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్‌ను పరిశీలించామని... అన్ని నిబంధనలు ఉన్నాయని.. వాహనం రిజిస్ట్రేషన్ కోసం చట్ట ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో వారాహి వాహనం రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ TS 13 EX 8384 అని కూడా వెల్లడించారు. కాగా, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం రూపొందించిన వారాహి వాహనం ఆర్మీ రంగులో ఉందని.. ఈ వాహనం రిజిస్ట్రేషన్‌కు రవాణాశాఖ అనుమతి ఇవ్వడం కష్టమని వైసీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా, తెలంగాణ ఆర్టీఏ అధికారులు వైసీపీ నేతల విమర్శలకు చెక్ పెట్టారని జనసేన అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : Mp GVL Vishaka Shift: అసలు కథ ఏంటో తెలుసా?