సురభి నాటకంలా కవిత లిక్కర్ కేసు.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
సురభి నాటకంలా కవిత లిక్కర్ కేసు.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత లిక్కర్ కేసు వ్యవహారం సురభి నాటకంలా మారిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరినట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ సీట్లకు గండి కొట్టాలని చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేస్తారని వారానికోసారి బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెప్పేవారని గుర్తుచేశారు. లిక్కర్ కేసులో బండి సంజయ్ ఏది చెబితే అదే చేసి.. బీజేపీ నేతలు ఈడీ అధికారులకు, దర్యాప్తు సంస్థలకు విలువ లేకుండా చేశారని అసహనం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేస్తే సంపతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కాగా, ఇవాళ సాయంత్రం ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story