బంగారం ధరలు తగ్గాలంటే రాహుల్ ప్రధాని కావాలి: జగ్గారెడ్డి

by GSrikanth |
బంగారం ధరలు తగ్గాలంటే రాహుల్ ప్రధాని కావాలి: జగ్గారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బంగారం ధరలు తగ్గాలంటే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయంలో మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్నప్పుడు బంగారం తులం కేవలం రూ.28 వేలు ఉండగా, మోడీ వచ్చాక రూ.76 వేలు అయిందన్నారు. థర్డ్ టైమ్ మోడీ వస్తే ఇక అన్నీ అమ్ముకునుడే అన్నారు. శ్రీరాముడు పేదల కోసం పాలన చేస్తే, బీజేపీ పెద్దల కోసం పనిచేస్తుందన్నారు. హిందూ ముస్లింల మధ్య ఘర్షణ పెట్టి రాజకీయాలు చేస్తుందన్నారు. శ్రీరాముడి పూజా సామగ్రి మీద కూడా జీఎస్టీ వేసిన చరిత్ర బీజేపీదన్నారు.

రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం ముందు మోడీ, అమిత్ షా రాజకీయం జీరో అన్నారు. మోడీ గ్లామర్ తగ్గిందన్నారు. ఇండియా కూటమికి అనుకూల వాతావరణం ఉన్నదన్నారు. కచ్చితంగా కాంగ్రెస్ దేశంలోనూ పవర్‌లోకి వస్తుందన్నారు. మోడీ నియంత, నిరంకుశ పాలన నడిపిస్తున్నారన్నారు. ఇలాంటి పాలన దేశానికి ప్రమాదమన్నారు. పీవీని పీఎం చేసిన ఘనత కాంగ్రెస్ దన్నారు. అందుకే మోడీ కూడా పీవీ నర్సింహారావు ఇంటికి వెళ్లాడన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, స్పోక్స్ పర్సన్ చరణ్​ కౌశిక్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story