Jagadish Reddy: బండి సంజయ్‌ది బీజేపీ అనే సంగతి మర్చిపోతున్నారు

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-29 13:04:50.0  )
Jagadish Reddy: బండి సంజయ్‌ది బీజేపీ అనే సంగతి మర్చిపోతున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay)కి బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ బీజేపీ(BJP) పార్టీకి చెందిన వ్యక్తి అనే విషయం మర్చిపోతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి సహాయ మంత్రిగా పనిచేస్తూ.. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అసలు విషయం మర్చిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి మద్దతిచ్చే క్రమంలో కేటీఆర్‌(KTR)పై బండి సంజయ్(Bandi Sanjay) అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని అన్నారు.

ఇకనైనా తన స్టాండ్ ఏంటో చెప్పాలి.. చిల్లర మాటలు మానుకోవాలని బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేటీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారని అన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్‌ను రేవ్ పార్టీలాగా చిత్రీకరించి నిందమోపడం సరికాదని తెలిపారు. రేవ్ పార్టీలకు చిన్న పిల్లలు, వృద్ధులు కూడా వెళ్తారా? అని ప్రశ్నించారు. ఈ విషయం కూడా బండి సంజయ్‌కి తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story