- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది బూటకపు ఎన్కౌంటర్ : మావోయిస్టు అధికార ప్రతినిధి గంగా
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : ఛత్తిస్ ఘడ్ రాష్ట్రం సుక్మాజిల్లాలోని దంతేష్ పురం అటవీ ప్రాంతం సోమవారం తెల్లవారుఝామున జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అధికార ప్రతినిధి గంగా పేర్కొన్నారు. నిజానికి ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన గోలాపల్లి ఎల్వోఎస్ కమాండర్ మడ్కమ్ ఎర్ర, మహిళా నక్సల్ పొడియం భీమే నెల రోజుల క్రితమే పార్టీని వదిలేసినట్టు తెలిపారు. సాధారణ జీవితం గడపటానికి భార్యాభర్తలైన ఈ ఇద్దరు దంతేష్ పూర్ గ్రామానికి వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. కాగా, ఈ ఇద్దరిని కొన్నిరోజుల క్రితం అదుపులోకి తీసుకున్న పోలీసులు తమకు అనుకూలంగా పనిచెయ్యాలని, మావోయిస్టుల జాడ చెప్పాలని చిత్ర హింసలు పెట్టినట్టు ఆరోపించారు. దానికి ఇద్దరు ఒప్పుకోక పోవటంతో దంతేష్ పూర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ పేర కాల్చి చంపారన్నారు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్, ఎస్పీ సునీల్ శర్మ మార్గదర్శకత్వం ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు సీజ్ చేసినట్టు పోలీసులు చెప్పిన మాటల్లో నిజం లేదన్నారు. పోలీసులు చిత్ర హింసలు పెట్టినా పార్టీకి ద్రోహం చెయ్యకుండా ప్రాణాలు త్యాగం చేసిన ఇద్దరికి విప్లవ జోహార్లు తెలిపారు.