Sama Rammohan Reddy : నీ టైం కూడా వచ్చినట్లుంది : కేటీఆర్ కు సామా రామ్మోహన్ రెడ్డి కౌంటర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-13 10:59:15.0  )
Sama Rammohan Reddy : నీ టైం కూడా వచ్చినట్లుంది : కేటీఆర్ కు సామా రామ్మోహన్ రెడ్డి కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్ : తప్పు చేసిన వారు పెద్దోళ్లయినా..పేదోళ్లయినా చట్టం ఒకటేనని..నీవు కూడా తప్పు చేస్తే చర్యలు తప్పవని...ఆ సమయం కూడా వచ్చినట్లుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ను ఉద్దేశించి కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) ఆసక్తికర కామెంట్లు చేశారు. అల్లు అర్జున్ అరెస్టును తప్పుబడుతూ కేటీఆర్ చేసిన ట్వీట్ ను సామా రామ్మోహన్ రెడ్డి తిప్పికొట్టారు. చదువుకున్న వాడివి..పదేళ్లు మంత్రిగా చేసినవాడివి చట్టం గురించి తెలియదా కేటీఆర్ అని రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. స్టార్ డమ్ ఉన్నా, నేషనల్ అవార్డు విన్నరైనా, చివరకు నువ్వు అయినా సరే తప్పు చేస్తే బొక్కలో ఉండాల్సిందేనన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేదలైనా, పెద్దలైనా చట్టం ముందు సమానమేనని మేం చాటామన్నారు. కేటీఆర్ సినిమావాళ్లని, సెలబ్రెటీలను వారి పాలనలో చట్టానికి చుట్టాలు చేసి కేసుల నుంచి తప్పించి ఉండవచ్చని ప్రజా ప్రభుత్వంలో అలాంటి వాటికి అస్కారం లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ వైఖరి చూస్తుంటే పేదలు, మహిళలు.. సామాన్య ప్రజల కేసుల పట్ల ఒక రకంగా, పెద్దలు, స్టార్ డమ్ వాళ్ల కేసులు మరోరకంగా చూడాలన్నట్లుగా ఉందని రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.

అల్లు అర్జున్ అంటే మాకు పగ లేదని..మేం కూడా ఆయనను అభిమానిస్తున్నామని, ఆయనతో ప్రభుత్వానికి అభద్రత ఎందుకుంటుందని కేటీఆర్ వ్యాఖ్యలను తోపిపుచ్చారు. సిరిసిల్లకు పోతే ఒక రోజు ముందుగా అభద్రతాభావంతో ముందస్తు అరెస్టులు జరిపించిన చరిత్ర నీదన్నారు. నాగార్జున ఎన్ కన్వెషన్ ను కూల్చే ధైర్యం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని, ప్రజా ప్రభుత్వం ఎవరికీ భయపడదని, అందుకే మేం ఆ పనిచేశామన్నారు. నాగార్జున ఎన్ కన్వెషన్ విషయంలోనైనా.. అల్లు అర్జున్ అరెస్టు లోనైనా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులే.. పేద.. పెద్ద అనే తేడాలుండవన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నట్లు ఇప్పుడు పోలీసులపై ఒత్తిడి లేదని.. ప్రజాపాలనలో వారు స్వేచ్ఛగా తమ విధులు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story