- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మూడు నెలలకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పగుళ్లు..

దిశ, చందుర్తి : చందుర్తి మండలంలోని నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మూనాళ్ళకే పగుళ్లు చూపింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగుల ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోతున్నారు. కట్టించి మూడు నెలలు కూడా కావడం లేదు ఇప్పుడే గోడలు పగుళ్లు చూపడం ఏంటని ఈ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వారు అంటున్నారు.
ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంచనా విలువ ఒక కోటి 50 లక్షలు (ఎఫ్ ఎఫ్ సి ) నిధులతో నిర్మాణం చేశారు. ఇంత ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మాణం చేశారు. బిల్డింగ్ కాంట్రాక్టర్ ఎంత నాణ్యత ప్రమాణాలతో ఈ హాస్పిటల్ నిర్మాణం చేశారో ఈ పగుళ్లను చూస్తే అర్థమవుతుందిని ఎద్దేవ చేస్తున్నారు. పేరుకే కొత్త భవనం మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికె స్లాబ్ నుండి అక్కడక్కడ ఉరుస్తూ కనిపించాయి. 40 సంవత్సరాల క్రితం నిర్మించిన పాత భవనమే మేలు అని హాస్పిటల్ సిబ్బంది అంటున్నారు. దీనిపైన జిల్లా అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.