- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బెట్టింగ్ కేసులో ముందడుగు.. నిందితుల జాబితాలో 19 యాప్ ల నిర్వాహకులు

దిశ, శేరిలింగంపల్లి : బెట్టింగ్ యాప్ లపై సీరియస్ గా ఉన్న పోలీసులు ఇప్పటికే పలువురు సినీ హీరోలు, హీరోయిన్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్స్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో 11 మందిపై కేసులు నమోదు కాగా, ఈ నెల 19న మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హీరో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ తో సహా మొత్తం 25 మందిపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసులు 19 బెట్టింగ్ యాప్ ల యజమానులను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఏ 23, జిగిల్ రమ్మీ డాట్ కామ్, యోలో 247, ఫెయిర్ ప్లే, జీత్ విన్, వి బుక్, తాజ్ 77, ధని బుక్ 365, మామ 247, తెలుగు 365, ఎస్ 365, జె 365, జెట్ ఎక్స్, ప్యారీ మ్యాచ్, తాజ్ 777 బుక్, ఆంధ్రా 365 యాప్ ల నిర్వాహకులను కూడా నిందితుల జాబితాలో చేర్చారు మియాపూర్ పోలీసులు. త్వరలోనే వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టేందుకు సిద్దమవుతున్నారు.