పది పరీక్ష పత్రం లీకేజీలో 11 మంది పాత్ర..

by Sumithra |
పది పరీక్ష పత్రం లీకేజీలో 11 మంది పాత్ర..
X

దిశ, నకిరేకల్ : పది పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ప్రశ్నపత్రం లీకేజీ ఘటన నల్లగొండ జిల్లాలో కలకలం రేపిన విషయం అందరికీ తెలిసిందే. వెంటనే పోలీసులు పరీక్షా పత్రం లీకేజీలో పాల్గొన్న 11 మంది నిందితులను గుర్తించారు. చిట్ల ఆకాష్, చిట్ల శివ, నల్ల శీను, గుడిగుంట్ల శంకర్, బ్రహ్మదేవుర రవిశంకర్ లను అరెస్టు చేశారు. అదేవిధంగా పోగుల శ్రీరాములు, తలారి అఖిల్ కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్ కుమార్, రాహుల్ పై కేసు నమోదు చేశారు. పరీక్ష పత్రం లీకేజీలో పాల్గొన్న నిందితులను పోలీసులు వెంటనే చేదించడంతో ప్రతి ఒక్కరు వారికి అభినందనలు తెలిపారు.

Next Story