ఇంట్లోనే ఉండి అధికారులకు సహకరిస్తున్న TRS Labour Minister Malla Reddy !

by GSrikanth |   ( Updated:2022-11-22 04:39:55.0  )
ఇంట్లోనే ఉండి అధికారులకు సహకరిస్తున్న TRS Labour Minister Malla Reddy !
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారులు, అల్లుడి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మొత్తంగా 50 బృందాలుగా విడిపోయి ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. బోయిన్‌పల్లి జయనగర్ కాలనీలోని మంత్రి మల్లారెడ్డి నివాసంలో పోలీసులు మీడియాకు అనుమతించలేదు. కనీసం ఫోటోలు కూడా తీయొద్దని సూచింనట్లు సమాచారం. మల్లారెడ్డి ఇంట్లోనే ఉండి అధికారులకు సహకరిస్తున్నాడని సమాచారం. మంత్రిని కలవడానికి వచ్చిన వారిని పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. అంతేగాక, బోయిన్‌పల్లిలోని సౌజన్య కాలనీలోని మంత్రి మల్లారెడ్డి అల్లుడు, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నారు. రాజశేఖర్ రెడ్డి అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సాయంత్రం వరకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం.

Read more:

1.మరో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి MLC కవిత శ్రీకారం!.. భారత్ ​జాగృతి ఫౌండేషన్ పేరిట ఏడేళ్ల కిందటే కొత్త సంస్థ ఏర్పాటు?..పెట్టుబడి లక్ష.. విరాళాలు కోట్లలో.. ఇంతకీ ఆఫీస్ ఎక్కడుందో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed