HYD: నగరంలో మరోసారి ఐటీ దాడుల కలకలం

by GSrikanth |
HYD: నగరంలో మరోసారి ఐటీ దాడుల కలకలం
X

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు కంపెనీలు, వ్యక్తులపై సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు గత కొద్దికాలంగా సైలెంట్‌గా ఉన్నారు. తాజాగా మరోసారి ఐటీ దాడులు ప్రారంభించారు. మంగళవారం ఉదయం నుండి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం, మొయినాబాద్ కోకాపేటలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఓ ఫార్మా కంపెనీతో పాటు మరో తొమ్మిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story