CM Revanth Reddy : ప్రభుత్వ బడుల మీద వ్యతిరేకత దూరం చేయాల్సింది టీచర్లే : సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
CM Revanth Reddy : ప్రభుత్వ బడుల మీద వ్యతిరేకత దూరం చేయాల్సింది టీచర్లే : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ పాఠశాలలు మీద వ్యతిరేకతను దూరం చేయాల్సింది టీచర్లే అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. జాతీయ బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, ప్రసంగించారు. రాష్ట్రంలో అనేక విద్యా సంస్కరణలు తీసుకు వస్తున్నామని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు విద్యా కమిషన్(Education Commission) ను నియమించామని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ళలో 5 వేల బడులను మూసీ వేస్తే.. తాము రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ టీచర్లకు ఉన్న విద్యార్హత ప్రయివేట్ టీచర్లకు ఉండదు.. అయినా గాని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ స్కూళ్లకు పంపడానికే ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ బడుల మీద వ్యతిరేకతను పోగొట్టే బాధ్యత ప్రభుత్వ టీచర్లదే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలిసి సమస్య ఏమిటో తెలుసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story