KR.Suresh Reddy : బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ పై సవతి తల్లి ప్రేమ చూపడం తగదు..

by Sumithra |
KR.Suresh Reddy : బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ పై సవతి తల్లి ప్రేమ చూపడం తగదు..
X

దిశ, ఆర్మూర్ : కేంద్ర ప్రభుత్వం 2024 - 25 సంవత్సరానికి సంబంధించిన యూనియన్ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పై సవతి తల్లి ప్రేమ చూపడం తగదని రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షనేత కే ఆర్.సురేష్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని రాజ్యసభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో మంగళవారం రాత్రి కె.ఆర్.సురేష్ రెడ్డి మాట్లాడారు. బడ్జెట్లో చర్చసందర్భంగా సభ్యులంతా ఆంధ్రప్రదేశ్, బీహార్ గురించే మాట్లాడుతున్నారన్నారు. ఏపీ విభజన చట్టానికి మూలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అని సురేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక 60 ఏళ్ల తెలంగాణ ప్రాంత ప్రజల పోరాటం ఉందని, వందల మంది విద్యార్థులు ఆత్మార్పణం చేసినట్లు వివరించారు. తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమం పోలీసు కాల్పులతో హింసాత్మకంగా సాగితే, 2001 నుంచి కేసీఆర్ నేతృత్వంలో శాంతియుత పోరాటాలు చేసి ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అన్నారు.

ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో గొప్ప మైలురాయిగా నిలిచిందన్నారు. విభజన చట్టంలో చెప్పినట్లు ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదని, వెనుకబడిన జిల్లాలకు నిధులను ఇవ్వలేదన్నారు. 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేయలేదని, బీహార్ లో వరదలు వచ్చినట్లు తెలంగాణలో కరువు వస్తుందని సురేష్ రెడ్డి అన్నారు. ఇక్కడ భూభాగం ఎత్తులో ఉంటే, నీళ్లు కిందివైపు ఉన్నాయని, అందుకోసం ప్రజల జీవన మనుగడకు ఎత్తిపోతల పథకాలు కావాలన్నారు. వాటిని ఏఐబీపీ కింద చేర్చి నిధులివ్వాలి" అని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ బీఆర్ఎస్ పక్ష నేత కే ఆర్.సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ, యువతి, యువకులకు, రైతులకు, మహిళలకు బడ్జెట్లో ఆశాజనకంగా కేటాయింపులు ఇవ్వడం పట్ల కె.ఆర్.సురేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story