‘పైన చేతులు వేయడం కామన్..! వాటిని పట్టించుకోవద్దు’

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-10 17:10:37.0  )
‘పైన చేతులు వేయడం కామన్..! వాటిని పట్టించుకోవద్దు’
X

దిశ, బషీరాబాద్ : చిన్నపిల్లలు ముఖ్యంగా బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మృగాల పట్ల కఠినంగా వ్యవహరించి, వారికి చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడాల్సిన చైల్డ్ లైన్ అధికారి తీరు వివాదాస్పదమైంది. బాలికలపై చేయి వేసే తప్పు ఏంటి..? ఇలాంటివి కామన్ అంటూ మాతో అసభ్యంగా ప్రవర్తించాడని బషీరాబాద్ బీసీ హాస్టల్ బాలికలు కన్నీళ్లు పెట్టుకున్నారు. గత శుక్రవారం మధ్యాహ్నం 12 అయిన టిఫిన్ పెట్టని ఘటనతో వెలుగు చూసిన బషీరాబాద్ బీసీ హాస్టల్ వార్డెన్ ఆమె భర్త వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది.

వీరి గురించి ఆరా తీస్తే ఇప్పటివరకు వార్డెన్ ఆమె భర్తతో పాటు వార్డెన్ తమ్ముడు దినేష్ బాలికల పట్ల ప్రవర్తించిన అసభ్య ప్రవర్తన అరాచకాలు బయటకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తప్పు చేసిన వారిపై శిక్షపడేలా చేయాల్సిన చైల్డ్ లైన్ అధికారి హన్మంత్ రెడ్డి దోషుల పక్షాన నిలబడి, నేటి సమాజంలో ఇలాంటివి చాలా కామన్ చిన్న వాటిని ఇంత పెద్దదిగా ఎందుకు చేస్తున్నారు అంటూ బాలికలను బెదిరించే ప్రయత్నం చేశాడని, అధికారులు, మీడియా ముందే చైల్డ్ లైన్ అధికారిని విద్యార్థులు ప్రశ్నించారు.

దాంతో మాట మార్చిన సదరు అధికారి నేను అలా అనలేదని, కేవలం ఒక్కొక్కరు సమాధానం చెప్తే మాకు అర్థమవుతుంది అన్నట్లుగా మాత్రమే చెప్పానని మాట మారుస్తున్నాడని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బాధ్యత గల హోదాలో ఉంటూ మాలాంటి విద్యార్థులకు న్యాయం చేయాల్సిన మీరే ఇలా మాట్లాడితే మాకు న్యాయం ఎలా జరుగుతుందని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి వారిని అధికారిగా కొనసాగించడం మాలాంటి విద్యార్థులకు ప్రమాదకరమంటూ చిన్నారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed