- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక పక్క రీల్స్.. మరోపక్క బైక్ స్టంట్స్.. అడ్డాగా మారిన ఐటీ కారిడార్
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో రాత్రి వేళ రాయదుర్గం, టీహబ్ రోడ్లు, ఐటీ క్షేత్రంలోని రహదారులు బైకు రేస్‌లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, బైక్ స్టంట్లకు కేంద్రాలుగా మారుతున్నాయి. హైదరాబాద్ నలమూలల నుంచి భారీగా బైకర్లు గుంపులుగా అక్కడికి చేరుకుంటారు. వాహనాలను మెరుపు వేగంతో డ్రైవ్ చేయడమే కాక విన్యాసాలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఇటీవల టీహబ్ వద్ద దాదాపు హంగామా సృష్టించిన 50 బైక్‌లను పోలీసులు సీజ్ చేశారు. పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని పోలీసులు స్పష్టం చేశారు.
అయితే, ఈ బైక్ స్టంట్స్‌పై నెటిజన్లు తీవ్ర ఆసహనం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రీధర్ అనే నెటిజన్ ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఐటీ కారిడార్‌లో బైక్ రేసింగ్ స్టార్ట్ చేసారు, రీల్స్ స్టార్ట్ చేశారు, నెక్ట్స్ లవర్స్ పార్క్ అయితది, ఆ తర్వత ఓపెన్ బార్ అయితది, ఫైనల్‌గా కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ అయితది. అప్పుడూ ఇన్వెస్టర్స్ బాగా వస్తారు.. అని సెటైర్లు చేశారు. ఈ వీడియో పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. హైదరాబాద్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ఇలా చేస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.