- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటీ దాడులు.. డొనేషన్లు కట్టలేదని చెప్పాలంటూ తల్లిదండ్రులకు ఫోన్లు
దిశ, వెబ్ డెస్క్: ఐటీ దాడులు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శంషాబాద్ లోని ఓ ఇంజనీరింగ్ కళాశాల నుంచి బుధవారం ఓ విద్యార్థిని తండ్రికి కళాశాల యాజమాన్యం నుంచి ఫోన్ వచ్చింది. ఎవరైనా బయటి వ్యక్తులు ఫోన్ చేసి కళాశాలకు డొనేషన్ కట్టారా అని అడిగితే చెల్లించామని చెప్పొద్దు అంటూ ఫోన్ చేసిన వ్యక్తి సూచించారు. ఈ విషయమై దేనికని ఆరా తీయగా ఐటీ దాడుల నేపథ్యంలో ఫోన్లు చేస్తున్నట్లు తెలిసింది. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల నేపథ్యంలో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఫోన్లు చేయిస్తున్నట్లు సమాచారం. డొనేషన్లకు ఎలాంటి రషీదు ఇవ్వరు గనుక ఆ సొమ్ముకు ఆదాయ పన్ను కూడా చెల్లించే ఆస్కారం ఉండదు. నగర శివారులోని ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ కు రూ.12-15 లక్షలు వసూలు చేస్తున్నాయి. ఎంచుకున్న బ్రాంచిని బట్టి రూ.6 నుంచి 15 లక్షల వరకు కళాశాలలు డొనేషన్లుగా వసూలు చేస్తున్నాయి. మెడికల్ సీట్ల కేటాయింపులో ఈ వసూళ్లు భారీ మొత్తంలో ఉన్నట్లు సమాచారం.
- Tags
- mallareddy