- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కాలంలో ఇస్కాన్ సేవలు మరువలేనివి : గవర్నర్ తమిళిసై
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడ్చల్ జిల్లా డబీల్ పూర్ ఇస్కాన్ టెంపుల్‌లో మహా సుదర్శన నర్సింహ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ తమిళిసై... రాష్ట్ర ప్రజల కోసం యాగం చేయడం గొప్ప విషయమని అన్నారు. చెన్నై నుండి యాగం కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చానని చెప్పారు. యాగంకు రావడం, అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహా సుదర్శన నర్సింహ హోమంలో పాల్గొనడం తన అదృష్టమని చెప్పారు. ఈ ఊరికి గవర్నర్ రావడం మొదటి సారని.. తానే ఫస్ట్ టైం రావడం ఇంకా సంతోషంగా ఉందని గవర్న్ తమిళి సై అన్నారు. గవర్నర్ గా రాలేదని, భక్తురాలిగా వచ్చానని అన్నారు. భక్తుల ఈలవేల్పు నర్సింహాస్వామి కోరిన కోరికలు తీరుస్తారన్నారు. కరోనా కాలంలో మేడ్చల్ ఇస్కాన్ సేవలు మరువలేనివని తమిళిసై కొనియాడారు. ఆహార సరఫరా, ఆరోగ్య సేవలను అందించి గొప్ప పేరు పొందారు. ఇస్కాన్ వారు ఇతర దేశాల్లో కూడా విస్తరించడం అభినందనీయం అన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్య ఉండాలని కోరారు.