మీరు తీసుకొస్తా అన్నా మార్పు ఇదేనా?.. ఎంపీ రఘునందన్ రావు ట్వీట్

by Ramesh Goud |
మీరు తీసుకొస్తా అన్నా మార్పు ఇదేనా?.. ఎంపీ రఘునందన్ రావు ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వం కలెక్టరేట్లతో సమానంగా పార్టీ కార్యాలయాలు నిర్మించుకుందే తప్ప విద్యార్ధుల వసతి భవనాలను పట్టించుకోలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. హాస్టల్.. హడల్, సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న సర్కార్ భవనాలు అని ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లలో కలెక్టరేట్లు పోలీసు కమిషనరేట్ల తో సమానంగా పార్టీ కార్యాలయాలు (తెలంగాణ భవన్) నిర్మించుకొని ప్రభుత్వ విద్యను భవనాలను పట్టించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను విమర్శించి పాఠశాల, విద్యార్థుల జీవితాలు బాగుచేస్తాం అని హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెకి ఎక్కింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదని ఆరోపించారు. ఇదేనా మీరు తీసుకవస్తా అన్న మార్పు?, ఇదేనా తెలంగాణ లో ప్రజాపాలన అంటూ రఘునందన్ రావు నిలదీశారు.

Advertisement

Next Story