- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది కాంగ్రెస్ పార్టీనా? లేక కన్ఫ్యూజన్ పార్టీనా? విశ్వేశ్వర్ రెడ్డి సెటైర్
దిశ, డైనమిక్ బ్యూరో:గడిచిన ఆరు నెలల్లో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని బీజేపీ నేత, చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా పుంజుకుందని అన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలోని సుల్తానీపురీలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పోలైనా ఓట్ల కంటే ఈసారి 20 శాతం ఓట్లు పెరగబోతున్నాయని చెప్పారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయాలని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ.. కేజ్రీవాల్ విషయంలో మరోలా మాట్లాడుతోందని ఇంతకు అది కాంగ్రెస్ పార్టీనా లేక కన్ఫ్యూజన్ పార్టీనా అని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీపై కాంగ్రెస్ దష్ప్రచారం చేసిందని దుయ్యబట్టారు.
రాయ్ బరేలీ రిజర్వుడ్ ఫర్ గాంధీ ఫ్యామిలీ:
యావత్ దేశవ్యాప్తంగా మోడీ హావా నడుస్తోందని ముఖ్యంగా సౌత్ ఇండియాలో మోడీ ప్రభంజనం కొనసాగుతోందన్నారు. అంబేద్కర్ ను ఓడించి అవమానించిన కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు లేదన్నారు. మోడీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్.. రాయ్ బరేలీలో మాత్రం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రిజర్వుడ్ ఫర్ గాంధీ ఫ్యామిలీ అనే రిజర్వేషన్ అమలు చేస్తోందని సెటైర్ వేశారు. రాయ్ బరేలీలో 31 శాతం ఎస్సీలు ఉన్నారని కానీ ఇప్పటి వరకు ఈ స్థానాన్ని ఎస్సీ రిజర్వుడ్ గా ప్రకటించకుండా గాంధీ ఫ్యామిలీకి రిజర్వ్ చేశారని ధ్వజమెత్తారు.