బిగ్ అలర్ట్: మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక

by GSrikanth |
బిగ్ అలర్ట్: మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నాలుగో విడత నీటిని అధికారులు విడుదల చేశారు. మంగళవారం ఉదయం 1460 క్యూసెక్కుల నీటిని జెన్‌కో గేట్ల ద్వారా దిగువకు వదిలారు. ఈ క్రమంలో మంజీరా నదీ పరివాహక ప్రాంత ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా మత్యకారులు నదిలో వేటకు వెళ్లొద్దని నీటి పారుదలశాఖ విజ్ఙప్తి చేశారు.

కాగా, అందోలు నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు సింగూరు జలాలను అందించడమే లక్ష్యంగా కాల్వల ఆధునికీకరణకు నీటిపారుదల శాఖ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశాలతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. సింగూరు ప్రాజెక్టు వరద కాల్వతో పాటు కుడి, ఎడమ కాల్వల పరిధిలో మొత్తం 60 కిలోమీటర్ల మేర ఆధునికీకరణకు రూ.300 కోట్లు అవసరమవుతాయని అంచనాలను రూపొందించి, ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది.

Advertisement

Next Story