- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
HYD: ఐపీఎల్ మ్యాచ్ ఎఫెక్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో ఇవాళ మధ్యా్హ్నం 03:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో మైదానంలో క్రీడాకారులను చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నగర పోలీసులు కీలక సూచనలు చేశారు. సుమారు 1500 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. స్టేడియానికి నాలుగు ప్రధాన మార్గాల్లో వెహికిల్స్‌ను అనుమతిస్తామన్నారు.
అయితే, భారీ వాహనాలకు ఉప్పల్ స్డేడియం వైపు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఉప్పల్ స్డేడియానికి వచ్చే ప్రధాన మార్గాల్లో ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వరంగల్ హైవే నుంచి హైదరాబాద్ నగరంలోకి వచ్చే భారీ వాహనాలు.. చెంగిచెర్ల చౌరస్తా, చెర్లపల్లి, ఐవోసీఎల్, ఎన్ఎఫ్సీ మీదుగా వెళ్లాలని సూచించారు. మల్లాపూర్ నుంచి నాచారం ఐడీఏ వైపు వెళ్లే హెవీ వెహికిల్స్ చెర్లపల్లి, చెంగిచెర్ల మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.