- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
UP Deputy CM: ప్రయాగ్ రాజ్‌కు రావాలని సీఎం రేవంత్‌కు ఆహ్వానం
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఏడాది జనవరిలో ప్రయాగ్ రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించామని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ మీడియాతో మాట్లాడారు. జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా కొనసాగుతుందన్నారు. ప్రయాగ్ రాజ్ గంగా, యమున, సరస్వతి సంగమని, మొదటి స్నానం జనవరి 13తో ప్రారంభమై చివరి స్నానం ఫిబ్రవరి 26న పూర్తవుతుందన్నారు. ఈసారి కుంభ మేళాకు 40 కోట్లకు పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆహ్వానాలను అందిస్తున్నామన్నారు. కుంభమేళాలో అన్ని రాష్ట్రాల క్యాంప్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడించారు.
భక్తుల సౌకర్యార్థం లక్ష 50 వేల టాయిలెట్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రయాగ్ రాజ్‌కు 100 కిలోమీటర్ల దూరంలోనే కాశీ, అయోధ్య రామమందిరం ఉందని, రైలు, రోడ్డు, విమాన మార్గాల ద్వారా భక్తులు వీటిని సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కుంభమేళాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేశామని తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అన్ని చోట్ల సీసీ కెమెరాలతో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించారు. గతం కన్నా ఈ సారి విదేశీయుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక ట్రైన్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈసారి కుంభామేళా కోసం రూ.6500 కోట్లను బడ్జెట్ కేటాయించామన్నారు. గతంలో కుంభామేళా సమయంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఏర్పాట్ల బాద్యతను అజాం ఖాన్‌కు అప్పజెప్పారని విమర్శించారు. దీంతో యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని, దాని పర్యవసానాన్ని అఖిలేష్ అనుభవిస్తున్నారని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు.