- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
High Court: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట కేసులో ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్(Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించడానికి అంతా సిద్ధమైన తరుణంలో హైకోర్టు(Telangana High Court) అనూహ్య నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పర్సనల్ బాండ్ తీసుకొని విడుదల చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అల్లు అర్జున్ తరపున ప్రముఖ సినీ నిర్మాత నిరంజన్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు.
మరోవైపు.. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని కోర్టు అభిప్రాయనడింది. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని పేర్కొంది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని.. కేవలం నటుడు కాబట్టే 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా..? అని ప్రశ్నించింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది. అంతమాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని హైకోర్టు అభిప్రాయపడింది.