TG Assembly : గులాబీ ప్రొడక్షన్ బ్యానర్.. ‘దిశ పేపర్’ కథనంపై కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
TG Assembly : గులాబీ ప్రొడక్షన్ బ్యానర్.. ‘దిశ పేపర్’ కథనంపై కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యూహాలు బెడిసికొట్టాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ‘దిశ పేపర్‌లో డ్యామిట్.. కథ అడ్డం తిరిగే’ అనే కథనం ప్రచురితమైంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేసింది.

‘గులాబీ ప్రొడక్షన్ బ్యానర్ పై అసెంబ్లీ సీజన్ లో విడుదలైన "బావ బామ్మర్దుల పోరాటం - ఫామ్ హౌస్‌లో అధినేత ఆరాటం" నాటకాలు ఘోరంగా ఫెయిలయ్యాయి. గులాబీల ఎత్తుడలు.. అయ్యయ్యో ఉత్త బడాయిలయ్యాయి. బావ బామ్మర్దుల డ్రామాలు.. బాక్సాఫీసు ముందు బొక్క బోర్ల పడ్డాయి. ఈ దశాబ్దపు బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ప్రజల్లో టాక్’ అని ట్వీట్ చేసింది. కాగా, ‘డ్యామిట్.. కథ అడ్డం తిరిగే’ కథనం పూర్తిగా చదవాలంటే శుక్రవారం రోజు వచ్చిన ‘దిశ పేపర్’ చూడాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed