- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇవాళ నేను విఫలం కావొచ్చు.. రేపు తప్పక విజయం సాధిస్తా: పవన్ కల్యాణ్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: మూడురోజుల పాటు జరిగే వరంగల్ నిట్ 2023 వసంతోత్సవ వేడుకలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. తాను ఇప్పటివరకు విద్యాసంస్థల కార్యక్రమాలకు వెళ్లలేదని, తన జీవితంలోని కొన్ని సంఘటనలను మీతో పంచుకోవడానికి వచ్చానని తెలిపారు. బాల్యంలో లియొనార్డో డావిన్సి తన రోల్ మోడల్ అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇంటర్ పరీక్షల సమయంలో తన స్నేహితులు స్లిప్స్ తీసుకెళ్లేవారని ఫన్నీగా గుర్తుచేసుకున్నారు. ఫెయిలైనా సరే కాపీ కొట్టకూడదని తాను భావించేవాడ్నని వివరించారు. తాను ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యానని, కానీ నైతికంగా విజయం సాధించానన్నారు.
నెహ్రూ ఎంతో ముందుచూపుతో ఎన్ఐటీలను ప్రారంభించారని కీర్తించారు. మీ సామర్థ్యానికి తగిన ఉద్యోగాలు రావాలని ఆకాంక్షిస్తున్నానని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పరాజయాలు ఎదుర్కొంటేనే విజయాలు సాధ్యమని పేర్కొన్నారు. ఇవాళ నేను విఫలం కావొచ్చు.. రేపు విజయం సాధిస్తా అని ధీమా వ్యక్తం చేశారు. కళ ఏ రాష్ట్రానికి చెందినవారినైనా కలుపుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. మనందరినీ కలిపేది సంస్కృతి ఒక్కటేనని పేర్కొన్నారు. మానవత్వం అనేది మనుషులను ఏకం చేస్తుందని తెలిపారు. నాటు నాటు పాటకు ప్రాంతాలకు అతీతంగా పాదం కదిపారని వివరించారు.