- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేయకుంటే పోటీకి దూరం!
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో పోటీపై రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయకుంటే పోటీకి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో గత ఏడాది రాజాసింగ్ ను బీజేపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో తన సస్పెన్షన్ పై మంగళవారం స్పందించిన రాజాసింగ్ తనకు ఇతర పార్టీ లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు.
తనపై పార్టీ విధించిన సస్పెన్షన్ అంశాన్ని బండి సంజయ్ చూసుకుంటారని పార్టీలో బండి సంజయే తనకు శ్రీరామరక్ష అని అన్నారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. పార్టీ నుంచి రాజాసింగ్ బహిష్కరణకు గురికావడంతో వచ్చే ఎన్నికల్లో ఈ టికెట్ ఎవరికో అనేది చర్చ జోరందుకుంది. రాజాసింగ్ కు టికెట్ కుదరకపోతే పోటీ చేసేందుకు స్థానిక బీజేపీ నేతలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుంటే పోటీకి దూరంగా ఉంటానని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.