- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో అవమానాలకు గురయ్యా: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
దిశ, వెబ్‌డెస్క్: జనగామ అత్యున్నత అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరానని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. జనగాంలో బీఆర్ఎస్ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలోనే బీఆర్ఎస్ కండువా కప్పి పొన్నాలను కేసీఆర్ పార్టీకి ఆహ్వానించారు. అనంతరం పొన్నాల మాట్లాడుతూ.. 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి అవమానాలకు గురి అయ్యానని తెలిపారు.
సీఎం అయిన మూడు నెలలకే కేసీఆర్ కులగణన, సమగ్ర సర్వే చేపట్టారని కొనియాడారు. సకల జనుల సర్వే చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. అణగారిని వర్గాలకు న్యాయం చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని పొగడ్తలు కురిపించారు. జనగాం నియోజకవర్గంలో కేసీఆర్ ఏడు రిజర్వాయర్లు నిర్మించారని చెప్పారు. జనగాంకు కేసీఆర్ మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ఈ సందర్భంగా పొన్నాల కోరారు.