SBI Recruitment: బ్యాంక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎస్‌బీఐలో 169 పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండి..!

by Maddikunta Saikiran |
SBI Recruitment: బ్యాంక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎస్‌బీఐలో 169 పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండి..!
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంక్ ఉద్యోగాల(Bank Jobs)కు ప్రిపేర్ అవుతున్న వారికి దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషల్ కేడర్ ఆఫీసర్(SCO) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 169 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/web/careers/current-openings ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 12 డిసెంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

  • అసిస్టెంట్ మేనేజర్(ఇంజినీర్- సివిల్) - 42
  • అసిస్టెంట్ మేనేజర్(ఇంజినీర్- ఎలక్ట్రికల్) - 25
  • అసిస్టెంట్ మేనేజర్(ఇంజినీర్- ఫైర్) - 101

విద్యార్హత:

పోస్టును బట్టి బీఈ/బీటెక్ ఉతీర్ణులై ఉండాలి. అలాగే పని చేసిన అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 1-10-2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్(ఇంజినీర్- ఫైర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు :

అన్ రిజర్వ్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 750, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 48,480 నుంచి రూ. 85,920 వరకు సాలరీ ఉంటుంది.

Advertisement

Next Story