Ola Electric layoffs: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఓలా.. 500 మంది తొలగింపు

by Shamantha N |
Ola Electric layoffs: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఓలా.. 500 మంది తొలగింపు
X

దిశ, బిజినెస్: ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) ఉద్యోగులకు షాకిచ్చింది. 500 మంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించింది. పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల్లో, వేర్వేరు స్థాయిల్లో ఉన్న వ్యక్తులకు లేఆఫ్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెహికిల్స్ సర్వీస్ విషయంలో ఓలా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంట సమయంలో ఈ నిర్ణయం రావడం గమనార్హం. జులై నుంచే తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా లేఆఫ్‌ల ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నాయి.

ఓలాపై విమర్శలు

ఓలా ఎలక్ట్రిక్ మార్జిన్‌లను మెరుగుపరచడం, లాభదాయకతను పెంపొందించే లక్ష్యంతో వర్క్‌ఫోర్స్‌ను ఆప్టిమైజ్ చేయాలని చూస్తోంది. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్‌ ఇటీవల కాలంలో తన సేవల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నెల ప్రారంభంలో వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థకు(CCPA) భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎలక్ట్రిక్ బైక్స్ లోపాలకు సంబంధించిన ఫిర్యాదులపై వివరణాత్మక విచారణకు ఆదేశిస్తూ సీసీపీఏ ఓలాకు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందిస్తూ 99 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్లు వివరణ ఇచ్చింది.

Advertisement
Next Story