- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: హైడ్రాకు ఇన్‌స్పిరేషన్ భగవద్గీత.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: భగవద్గీత స్పూర్తితోనే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని, ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులు అక్రమించిన వారి భరతం పడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోకాపేటలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అనంత శేశ స్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హైడ్రా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను నిజాం ఆనాడే లేక్ సిటీగా గుర్తించి గొలుసు కట్టు చెరువుల నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. కరువు వచ్చిన సమయంలో గండిపేట, ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయి. కానీ కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాం కట్టుకొని, ఆ నాళాలు గండిపేటలో కలిపారని, ఇప్పుడు వాటిని తాగునీటిగా ఉపయోగించేందుకు ఇబ్బందిగా మారిందని తెలిపారు.
అలాంటి అక్రమ నిర్మాణాలు వదిలేస్తే ప్రజా ప్రతినిధిగా తాను విఫలమైనట్లేనని, అందుకే ఎవరు ఎంత ఒత్తిడి చేసినా.. మిత్రులకు ఫాంహౌజ్ లు ఉన్నా.. హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి, చెరువులను ఆక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. అక్రమణదారుల నుంచి చెరువులకు విముక్తి కల్పిస్తున్నామని వ్యాఖ్యానించారు. భగవద్గీత స్పూర్తితోనే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని, ఇందులో ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నవారు ఉండొచ్చు, సమాజాన్ని ప్రభావితం చేసే వారు ఉండొచ్చు, ఎవరిని పట్టించుకోనని స్పష్టం చేశారు. ఇది రాజకీయాల కోసమో.. నాయకులపై కక్ష సాధింపుకో చేయట్లేదని, భవిష్యత్ తరాల కోసం అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని వివరణ ఇచ్చారు.
ప్రకృతిని విధ్వంసం చేస్తే ప్రకృతి విలయం ఎలా ఉంటుందో చూస్తున్నామని, ఇప్పటికే చెన్నై ఉత్తరాఖండ్, వయనాడ్‌లలో ఏం జరిగిందో చూశామని గుర్తుచేశారు. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, ఇందులో భాగంగానే చెరువులను రక్షణను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులు అక్రమించిన వారి బరతం పడతామని హెచ్చరించారు. ఇక హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఏ కార్యక్రమం చేపట్టినా దానికి ప్రభుత్వం పూర్తి సహాకారం అందిస్తామని, అలాగే పేదల కోసం చేపట్టే పథకాలలో ట్రస్ట్ సహాకారం అందించి, తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మీ వంతు సహాకారం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు.